ఎమ్మెల్సీ ఎన్నికలో మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం..

17

మహబూబ్‌ నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించింది.. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ చెందిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు అధికారికంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా,టీఆర్ఎస్ అభ్యర్థులు కశిరెడ్డి నారాయణ రెడ్డి,కూచుకుళ్ళ దామోదర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో 95 శాతం మంది‌ టీఆర్ఎస్‌కు‌ చెందిన వాళ్లే ఉన్నారు. నామినేషన్లు వేసిన స్వతంత్రులు ఉపసంహరించుకున్నారు.మా విజయం ఖాయమైందన్నారు. రెండు ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ లే రెండోసారి ఎన్నిక అవుతుండటం శుభపరిణామని మంత్రి అన్నారు.

ఇద్దరు అనుభజ్ఞులకు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ భీ ఫాంలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి ఎన్నికతో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్దిలోకి నడిపిస్తాం.. ఉద్యమ గాయకుడు సాయిచంద్‌కు టీఆర్ఎస్ సముచిత స్థానం కల్పిస్తుంది. ఎంపిటీల సమస్యల పరిష్కారనికి ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.