కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు..

144
- Advertisement -

దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మూడు వారాల వ్యవధిలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన మోడల్ కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ దీనిపై దృష్టిపెట్టింది. ఈ మేరకు ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రులు, అధికారులతో గురువారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.

కాగా, ఇందు కోసం వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో ఒక బృందం ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ కిచెన్ల పథకానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించనుంది కార్యదర్శుల బృందం. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా పూర్తి పారదర్శకంగా ఉండేలా పథకాన్ని రూపొందించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించించారు. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఈనెల 29న మరోసారి కేంద్ర, రాష్ట్రాల ఆహార కార్యదర్శులు సమావేశం కానున్నారు.

- Advertisement -