భారీగా వ‌సూళ్లు చేస్తున్న ఈ ‘స్త్రీ’ని చూడండి..

261
Stree Movie
- Advertisement -

బాలీవుడ్‌ హీరో రాజ్ కుమార్ రావు, హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం‘స్త్రీ’. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్నేళ్ల క్రితం రాత్రిపూట ఓ ఆడ దయ్యం సంచరిస్తూ ప్రజలను చంపేస్తోందంటూ వదంతులు రావడం.. దీంతో దయ్యం ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలామంది ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ తమ ఇళ్లపై రాసుకోవడం చాలా మందికి తెలిసిన విషయమే.

Stree Movie

ఇలాంటి హర్రర్‌ కథాంశంతోనే ‘స్త్రీ’ చిత్రాన్ని అమర్ కౌశిక్ తెరకెక్కించారు. మొదటి మూడు రోజుల్లోనే ఆ సినిమా సుమారు రూ.32.07 కోట్లు వసూల్ చేసింది. హారర్ కామిడీగా తెరకెక్కిన ‘స్త్రీ’.. విడుదలైన మొదటి రోజే సుమారు ఏడు కోట్లు వసూల్ చేసింది. ఆ తర్వాత శని, ఆదివారాల్లో ఈ సినిమాకు ఇంకా మంచి వసూళ్లు వచ్చాయి.

- Advertisement -