తొలి టీ20లో టీమిండియా ఓటమి..

85
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైంది. విండీస్ విధించిన స్వల్ప లక్ష్యం 150 పరుగులను కూడా చేయలేకపోయింది భారత్. 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

తిలక్‌ వర్మ (22 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (3), ఇషాన్‌ కిషన్‌ (6) విఫలమయ్యారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (21 ), కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా (19), సంజూ శాంసన్‌ (12), అక్షర్‌ పటేల్‌ (13) ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు సంజూ శాంసన్‌ క్రీజులో ఉండటంతో భారత్‌ గెలుపు ఖాయమే అనుకున్నారు అంతా. అయితే 16వ ఓవర్‌లో హోల్డర్‌ మ్యాజిక్ చేశాడు. తొలి బంతికే హార్దిక్‌ను వెనక్కి పంపగా.. మూడో బంతికి శాంసన్‌ రనౌటయ్యాడు. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 100 కోట్లు

ఇక అంతకముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ రావ్‌మన్‌ పావెల్‌ (32 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా నికోలస్‌ పూరన్‌ (41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాండన్‌ కింగ్‌ (28; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఆదివారం రెండో టీ20 జరుగనుంది.

Also Read:బెదురులంక 2012..దొంగోడే దొరగాడు సాంగ్

- Advertisement -