మూడో టీ20లో భారత్ గెలుపు…

12
- Advertisement -

వరుస రెండు టీ20ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. మూడో టీ20లో విండీస్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగు లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 164 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స ర్లుతో 83, హైదరాబాదీ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ 37 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ రాణించడంతో భారత్ విజయతీరాలకు చేరింది. .

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42, కెప్టెన్‌ రావ్‌మన్‌ పావెల్‌ 19 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్సర్లతో 40 పరుగులు చేయగా మయేర్స్‌ (25), పూరన్‌ (20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3, అక్షర్‌ పటేల్‌, ముఖేశ్‌ కుమార్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Also Read:లక్షలాది వ్యూస్‌తో .. “తెలుగింటి సంస్కృతి”

- Advertisement -