IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే

23
- Advertisement -

విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. కీలకమైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో విండీస్‌ను చిత్తు చేసింది భారత్.352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కేవలం 151 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో గుడాకేస్ మోటీ (39 నాటౌట్), అథనేజ్ (32), అల్జారీ జోసెఫ్ (26), కరియా (19)పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్‌ (3/30), కుల్‌దీప్‌ యాదవ్ (2/25) వికెట్లు పడగొట్టారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు గిల్,ఇషాన్ మంచి శుభారంభాన్ని అందించారు. 143 పరుగుల స్కోర్ వద్ద 64 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఔట్ కాగా తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 8పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సంజూ శాంసన్ (51) ,గిల్ 85 పరుగులు చేశారు. ఇక చివర్లో హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 72 పరుగులు చేయడంతో భారత్ 350 పరుగులు దాటింది.

Also Read:#VD13 సెట్స్‌లో మృణాల్ బర్త్ డే..

వన్డేల్లో వెస్టిండీస్ పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2018లో కరీబియన్ జట్టుపై భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు విండీస్ పై భారత్ వరుసగా 13వ సారి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

- Advertisement -