తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహానీయుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్ సమీపంలో అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని యావత్తు దేశ ప్రజలు సంబురపడేలా విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించగా సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొంటారు.ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ అంబేద్కర్‌కు ఘనంగా పుష్పాంజలి ఘటిస్తారు.
ఇక ఈ విగ్రహం ప్రత్యేకతలను ఓసారి పరిశీలిస్తే.. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశంలోనే పెద్దది. రూ.146.50 కోట్లతో ఈ నిర్మాణం పూర్తయింది.
పచ్చదనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెయిన్, పూలవనాలు, కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు. టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్ నిర్మాణాలు ఉన్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీని ఎత్తయిన గ్రిల్స్‌తో ఏర్పాటు చేశారు.అంబేద్కర్ స్మృతిభవనాన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో టాయిలెట్స్, ఏసీ ఔట్‌డోర్ యూనిట్స్, స్టోర్ రూమ్స్ నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్ లేదంటే మధ్య భాగంలోనే కీలకమైన నిర్మాణాలను చేపట్టారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. తొలుత ఉక్కుతో విగ్రహన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించడం విశేషం. విగ్రహం దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్ కోటింగ్ వినియోగించారు.ప్రధాన కాన్ఫరెన్స్ హాలు, మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో అంబేద్కర్ జీవితంలోని కీలకమైన, మరుపురాని ఘట్టాలకు సంబంధించిన వీడియోలను నిత్యం ప్రదర్శించనున్నారు. ఇదే ఫ్లోర్‌లో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే ఫొటో గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. పై అంతస్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన పీఠం ఉంటుంది. దీనిని సందర్శకులు తిరుగాడేందుకు వీలుగా తీర్చిదిద్దారు.
ఇవి కూడా చదవండి..