అంబేద్కర్‌ మార్గం సదా ఆచరణీయం: సీఎం కేసీఆర్

174
kcr

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్, బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ నడిచిన మార్గం ఎప్పటికీ ఆచరణీయం అని..భారత్ ఓ గొప్ప ప్రజాస్వామిక,గణతంత్ర,లౌకిక రాజ్యంగా ఎదగడం వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉందన్నారు.

అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉండిపోతారని..అణగారిన వర్గాల ఇబ్బందుల్ని దశాబ్దాల క్రితమే ఊహించి మార్గం చూపాడని కొనియాడారు.