HMDA:హెచ్ఎండిఏకు అవార్డుల పంట..

85
- Advertisement -

రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏడవ గార్డెన్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి 25అవార్డులు గెలుచుకుంది. దీనిలో మొత్తంగా 13ఫస్ట్ అవార్డులు, 12సెకండ్ అవార్డులు వచ్చాయి. శనివారం సాయంత్రం పబ్లిక్ గార్డెన్‌ సెంట్రల్‌ లాన్‌లో జరిగే ఈ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్ బి ప్రభాకర్‌ అవార్డులను అందుకోనున్నారు. రాష్ట్ర ఉద్యానవనశాఖ అవార్డులకు హెచ్‌ఎండీఏ పార్కులు ఎంపిక కావడం పట్ల మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్,ఆర్బన్ ఫారెస్ట్‌ డైరెక్టర్ ప్రభాకర్‌తో పాటు సిబ్బందికి అభినందనలు తెలిపారు.

అవార్డుల జాబితా..

  1. మొదటి ర్యాంకు సీఎం క్యాంప్ ఆఫీస్‌
  2. మొదటి ర్యాంకు రాజ్‌భవన్‌
  3. మొదటి ర్యాంకు ట్యాంక్‌బండ్‌ లాండ్‌స్కేప్
  4. మొదటి ర్యాంకు ఫార్మల్ గార్డెన్ ఎన్టీఆర్‌ గార్డెన్‌
  5. మొదటి ర్యాంకు నేషనల్ ఫ్లాగ్ సంజీవయ్య పార్క్‌
  6. మొదటి ర్యాంకు డాక్టర్ జీఎస్ మెల్కోటే పార్క్‌, నారాయణగూడ
  7. మొదటి ర్యాంకు రాజీవ్ గాంధీపార్క్, వనస్థలిపురం
  8. మొదటి ర్యాంకు ఇందిరా గాంధీ రోటరీ
  9. మొదటి ర్యాంకు రాక్ గార్డెన్
  10. మొదటి ర్యాంకు బుల్‌ రోటరీ ఎట్‌ నానక్‌రామ్‌గూడా
  11. మొదటి ర్యాంకు రోటరీ నియర్‌ హెచ్‌జీసీఎల్‌ ఆఫీస్ నానక్‌రామ్‌గూడా
  12. మొదటి ర్యాంకు రెయిన్‌ గార్డెన్, బెగంపేట్‌
  13. మొదటి ర్యాంకు క్రిమటోరియం ఎట్‌ ఫతేగూడ
  14. రెండవ ర్యాంకు రోటరీ ఎట్ బొంగళూర్‌ ఇంటర్‌ఛేంజ్‌
  15. రెండవ ర్యాంకు ఓఆర్ఆర్ మెడైన్
  16. రెండవ ర్యాంకు వరంగల్ హైవే రోడ్‌ మెడైన్‌
  17. రెండవ ర్యాంకు బటర్‌ఫ్లై గార్డెన్‌
  18. రెండవ ర్యాంకు రోజ్ గార్డెన్
  19. రెండవ ర్యాంకు సంజీవయ్య సమాధి
  20. రెండవ ర్యాంకు ఎన్‌టీఆర్‌ మెమోరియల్
  21. రెండవ ర్యాంకు పీవీ సమాధి
  22. రెండవ ర్యాంకు పటేల్‌కుంట పార్క్‌, కుకట్‌పల్లి
  23. రెండవ ర్యాంకు శాస్త్రిపురం పార్క్‌, లంగర్‌హౌస్‌
  24. రెండవ ర్యాంకు బాపుఘాట్, లంగర్‌హౌస్‌
  25. రెండవ ర్యాంకు లేక్‌వ్యూ పార్క్‌

ఇవి కూడా చదవండి…

నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు…

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: జేడీ

సీఎం కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది :తోట

- Advertisement -