‎’హగ్ ఏ ట్రీ’ కొత్త ఛాలెంజ్…

237
Sumath
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఛాలెంజ్‎ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఐస్ బకెట్, రైస్ బకెట్ లలో పాల్గొని  హల్‎చల్ చేయగా. మళ్లీ హామ్ ఫిట్‎తో ఇండియా ఫిట్ పేరిట కొత్త ఛాలెంచ్‎ని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాలెంజ్‎కి శ్రీకారం చుట్టారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. మనిషి జీవితంలో చెట్ల ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ‘హగ్ ఏ ట్రీ’ అనే ఛాలెంజ్‎ని ప్రారంభించానని చెప్పారు.

తాను ఆప్యాయంగా ఓ చెట్టును కౌగిలించుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… సమంత. సుమంత్, సుధీర్ బాబు, రానా, అకోశ్ గల్లా, సిద్ గల్లాలకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఇక గల్లా విసిరిన సవాల్‎కు హీరో సుమంత్ స్పందించారు. మీ ఛాలెంజ్‎ను స్వీకరిస్తున్నా అంటూ ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో సుమంత్ ఓ చెట్టును హగ్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న పెంపుడు కుక్క కూడా ఆయనను అనుకరిస్తూ.. చెట్టుకు రెండు కాళ్లు పెట్టింది. ఇక సుమంత్ కూడా అఖిల్, నాగచైతన్య, సమంత, సుశాంత్‎లకు ‘హగ్ ఏ ట్రీ’ ఛాలెంజ్‎ను విసిరాడు.

- Advertisement -