‘ఆటగదరా శివ’ ట్రైలర్

181

ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్ద తెర‌కెక్కించిన ఆట‌గ‌ద‌రా శివ మూవీ ట్రైల‌ర్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు చిత్ర బృందం. విభిన్న క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త కొత్త సినిమాల‌ను ప‌రిచ‌యం చేస్తుంటాడు డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్ధ‌. ఫ్యామిలికి సెంటిమెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువ‌గా తీస్తుంటాడు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం లో ఈ ఆట‌గ‌ద‌రా శివ సినిమాను తెర‌కెక్కించాడు. ల‌వ్ స్టోరీలు కాకుండా మ‌నుషుల విలువ‌ల మీద మెసేజ్ లు ఇచ్చే సినిమాలు తీయ‌డంలో ముందుంటాడు ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్ధ‌.

AatagadharaaSivaa

ఇక తాజ‌గా విడుద‌ల చేసిన ఆట‌గ‌దరా శివ సినిమా ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఒక హ్యాంగ్ మేన్ జీవిత స్టోరీ ఆధారంగా ఈసినిమాను తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు. కామెడీ, యాక్ష‌న్ సీన్ ల‌తో సినిమాను రూపొందించారు. ఈసినిమాలో జ‌బ‌ర్ధ‌స్త ఫేం హైప‌ర్ ఆది, చ‌మ్మ‌క్ చంద్ర‌లు ఇద్ద‌రూ త‌మ‌ కామెడితో సినిమాలో హైలెట్ గా నిల‌వ‌నున్నారు. ట్రైల‌ర్ లో ఆది పంచ్ డైలాగ్ మార్క్ లు క‌న‌బ‌డుతున్నాయి.

Aatagadharaa Siva Movie Trailer | Chandra Siddarth | Rockline Entertainments | #AatagadharaaSiva

ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించి డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని..త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు ద‌ర్శ‌కుడు చంద్రసిద్ధార్ధ. ఇక చంద్ర‌సిద్ధార్ధ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆన‌లుగురు, మ‌ధుమాసం, అంద‌రి బంధువ‌యా సినిమాలు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఇక చాలా రోజ‌లు త‌ర్వాత చంద్ర‌సిద్ధార్ద్ తీస్తున్న ఈసినిమా ఎంత వ‌ర‌కూ విజ‌యం సాధిస్తోందో చూడాలి.