Revanth:ఏపీ పాలిటిక్స్ లోకి.. రేవంత్ రెడ్డి ?

12
- Advertisement -

తెలంగాణ సి‌ఎం రేవంత్ రెడ్డి ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా ? ఏపీలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తునాయి. తెలంగాణలో పూర్తిగా డీలా పడ్డ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే… ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కొంత బలం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ జోష్ మరింత పెంచేందుకు హస్తం అధిష్టానం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిని బరిలో దించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది, ఆ మధ్య రేవంత్ రెడ్డి కూడా ఏపీలో ప్రచారం చేసేందుకు తాను సిద్దమే అని వ్యాఖ్యానించిన సంగతి విధితమే. తాజాగా ఈ విషయంపై ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా స్పందించారు. .

త్వరలో రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే తెలంగాణ సి‌ఎం గా రేవంత్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తరువాత ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డిపై అడపా దడపా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటే.. జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పైగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబే తన రాజకీయ గురువు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి చంద్రబాబు విషయంలో రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ఆసక్తికరమే. మొత్తానికి ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అడుగు పెడితే రాజకీయంగా కాంగ్రెస్ కు ఎంతమేర లాభం చేకూరుతుందనేది పక్కన పెడితే.. ఆయన కారణంగా కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:సోంపు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

- Advertisement -