దోషులను శిక్షించండి..

488
Punish the criminals
- Advertisement -

తన అభిమాని వినోద్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో వినోద్ కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్‌…వారిని ఓదార్చారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు, ఇలా ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిందని అన్నాడు. తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని.. ఆమాటకొస్తే సినీ పరిశ్రమలో ఎవరూ ఎవరితోనూ గొడవలు పడరని పవన్ కల్యాణ్ తెలిపారు. హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవ పడరు గానీ, కిందికి వచ్చేసరికి అభిమానులు మాత్రం గొడవ పడతారని చెప్పారు. మరణించిన వినోద్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ ఘటనపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అప్పుడు సీబీఐ విచారణ కోరుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అభిమానం కొంతవరకే ఉండాలని, అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని ఆయన చెప్పారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్ పోలీసు స్టేషన్ నుంచి, అక్కడి వర్గాల నుంచి తెలుసుకుంటానని పవన్ చెప్పారు.

వీడియో కోసం క్లిక్ చేయండి:

https://youtu.be/exfUZoH8s6A

- Advertisement -