జెట్‌ నన్ను కాదంది…

267
Jet said no to Smrithi
Jet said no to Smrithi
- Advertisement -

స్మృతీ ఇరానీ…టీవీ యాక్ట్రెస్ గా ఉన్న ఈమె కాస్తా రెండేళ్ల క్రితం, ఎవరూ ఉఃహించని ఎత్తుకు ఎదిగారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడమేకాదు, ఏకంగా  కీలకమైన మానవవనరుల అభివృద్ధి మంత్రి అయిపోయారు. వెంటనే ఆమె విద్యార్హతల గురించి వివాదం రేగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీ జే ఎన్ యూలో జరిగిన పరిణామాలు ఆమెను మరింత వివాదాస్పదురాలిగా మార్చేశాయి.

ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.మొదట తాను జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఉద్యోగం చేయాలని కోరుకున్నట్టు చెప్పారు. అయితే మంచి శరీరదారుఢ్యం లేదన్న కారణంతో తనకు ఉద్యోగం ఇచ్చేందుకు జెట్ ఎయిర్వేస్ నిరాకరించిందని చెప్పారు.

ఏపీఏఐలో తానిప్పుడు పాసింజర్ గా చేరానని తెలిపారు. ఓ జెట్ ఎయిర్ వేస్ అధికారికి అవార్డును ఇస్తూ, “నా తొలి ఉద్యోగ ప్రయత్నం గురించి చాలా మందికి తెలిసి వుండకపోవచ్చు. జెట్ లో క్యాబిన్ క్రూ ఉద్యోగం కోసం క్యూలో నిలబడ్డాను. అందమైన శరీరాకృతి లేదంటూ నన్ను తిరస్కరించారు. వారి నిర్ణయం చాలా మంచిదైంది” అని తన యుక్త వయసు రోజులను స్మృతీ గుర్తు చేసుకున్నారు. ఆపై నేను మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగం సంపాదించాను. మిగతాదంతా అందరికీ తెలిసిన చరిత్రే. నాడు జెట్ ఎయిర్ వేస్ నన్ను తిరస్కరించడం ఎంతో మంచిదైంది. వారి నాటి నిర్ణయానికి కృతజ్ఞతలు” అని స్మృతీ వ్యాఖ్యానించారు.

- Advertisement -