కోట్లు ఖరీదు చేసే బల్లులు…

288
- Advertisement -

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. బల్లి పడ్డ ఆహారం తింటే విషమని…..బల్లి మీద పడ్డ అరిష్టమన్న ప్రచారం ఉంది.

అయితే, కొన్ని అరుదైన జాతి బల్లుల నుంచి ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్తర భారతంలో కనిపించే టోకే జీకో అనే అరుదైన జాతికి చెందిన బల్లులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. 40 సెంమీల పొడవు…200 గ్రాముల బరువుండే ఈ జాతికి చెందిన బల్లులలో పుష్కలమైన ఔషధ విలువలుంటాయి. ఒక్కో బల్లి విలువ దాదాపుగా లక్షలల్లో పలుకుతుంది. దీంతో ఈ జాతికి చెందిన బల్లులను అక్రమంగా రవాణా చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.

Lezard

ఇండో-నేపాల్ సరిహద్దులో ఇలాంటి రకానికి చెందిన బల్లులను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 బల్లులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలు దాదాపుగా కోటి పది లక్షల రూపాయలు. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో స్మగ్లింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే దాదాపుగా 70 బల్లులను పోలీసులు పట్టుకున్నారు.

ఈ రకమైన సరిసృపానికి చెందిన బల్లులలో ఔషధ విలువలు ఉన్నాయనటానికి ఎలాంటి ఆధారాలు లేవని..కేవలం అపోహ మాత్రమేనని పర్యావరణ వేత్తలు,శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది స్ధానికులను ప్రోత్సహిస్తు….అక్రమ రావాణాకు పాల్పడతున్నారని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇది నేరమని….దొరికిన వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -