కో…కో…..కొకైన్‌..

248
- Advertisement -

ప్రముఖ శీతలపానీయాల కంపెనీ కోకాకోలా ప్లాంట్‌లో కొకైన్ బయటపడటం సంచలనం రేపింది. దాదాపుగా 370 కిలోల కొకైన్‌ను దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్ను అక్కడి కార్మికులు గుర్తించారుఅయితే కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ కార్మికుల పాత్ర లేదని ఫ్రాన్స్ పోలీసు అధికారుల విచారణలో వెల్లడి అయ్యింది.

cocaine

దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ ‘ఇండిపెండెంట్’ బుధవారం వెల్లడించింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు కోకా కోలా ప్లాంట్ దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కంటెయినర్ లో ఉన్న 370 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని, మార్కెట్ లో దాని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని విచారణాధికారి జీన్ డెనిస్ మల్ గ్రాస్ చెప్పారు.

Coke

ఫ్రాన్స్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో కొకైన స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. కొకైక్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Coca cola

- Advertisement -