చంద్రబాబు హైరానా..

211
- Advertisement -

రెండు రాష్ట్రాల్లోనూ సంచలన రేపిన ఓటుకు నోటు కేసులో పునర్విచారణకు ఎసిబి కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమేయంపై విచారించి సెప్టెంబర్‌ 29వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఎబిసిని ఆదేశించింది. ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.

ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు ముందస్తుగా కనిపెట్టడంలో విఫలమయ్యారని దాని వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని నిఘా విభాగం అధికారులపై చంద్రబాబు చిందులు వేసినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. ఓటుకు నోటు సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన అనురాధను బాబు తప్పించారు. ఆమె వైఫల్యం కారణంగానే తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపినట్లు సమాచారం.

Sujana-Chowdary

ఓటుకు నోటు కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించడానికి నిరాకరించారు. ఓటుకు నోటు కేసుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు దానిపై తాను స్పందించడమేమిటని ఎదురు ప్రశ్న వేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసు నుంచి బాబును గట్టెక్కించడానికి కేంద్రమంత్రి సుజనా చౌదరి రంగంలోకి దిగినట్లు సమాచారం.ఇటీవలె ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో గవర్నర్‌ను కలిసిన సుజనా…. ఓటుకు నోటు కేసు అంశాన్ని చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌తో సయోథ్య కుదిర్చేందుకు చొరవ చూపించాలని కోరినట్లు సమాచారం.

ak khan

ఇదిఇలా ఉండగా వైసిపి ఎమ్మెల్యే పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలు సోమవారం జారీ చేయడం, మంగళవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో సుదీర్ఘ సమయం భేటీ కావడం, అదే సమయంలో రాజ్ భవన్‌కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. గవర్నర్, సీఎంలకు దర్యాఫ్తు వివరాలు వెల్లడించారని తెలుస్తోంది. కేసు దర్యాఫ్తు ఎంత వరకు వచ్చిందనే విషయం కూడా చెప్పారని సమాచారం. కోర్టు ఆదేశాలు, గవర్నర్‌తో కేసీఆర్ భేటీ నేపథ్యంలో చంద్రబాబు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, ఇతరుల ద్వారా చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు రావటంతో బాబు అండ్ కో హైరానాలో పడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ తో ఫోన్లో రాయబారాలు సాగించారని, ఆ వాయిస్ ఆయనదేనని, ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబు ను ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం శిక్షించాలని, ఈ కేసులో చంద్రబాబు పాత్రపై తప్పనిసరిగా దర్యాప్తు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు ఏసీబీని నెలరోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కుట్ర నిరూపించే ఆధారాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ నిన్ననే ఓ మెమో కూడా దాఖలు చేసింది. ఈ లోగా చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేసు తన మెడకు పూర్తిగా బిగుసుకోకుండా ముందుగా ఎలర్ట్ అయ్యారు.

- Advertisement -