అమ్మ దయతో స్వర్ణ ‘సింధు’వై రా..

595
PV Sindhu creates history
PV Sindhu creates history
- Advertisement -

ఎన్ని టైటిళ్లు గెలిచినా ఒలింపిక్స్ మెడల్ సాధిస్తే ఆ కిక్కే వేరు.. 125 కోట్ల మంది ఆశ‌లు మోస్తూ ఈ ఏడాది ఒలింపిక్స్ లో 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అందరు ఒక్కొక్కరుగా ఇంటి దారి పట్టారు. అయితే, సహచరులు ఒక్కొక్కరుగా రియో పోటీల నుంచి వైదొలుగుతున్న తెలుగుతేజం సింధూ మాత్రం తన సత్తాని చాటి….బంగారు పతకానికి ఒక అడుగుదూరంలో నిలిచింది.

పోటీలకు ముందు పీవీ సింధూ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. అమ్మవారికి బోనం సమర్పించి….ప్రత్యేక ప్రార్థనలు చేసింది. అమ్మోరు తల్లి దీవెనలు….కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో రియో ఒలింపిక్స్‌లో ఆరంభం నుంచి అంచనాలకు మించి రానించింది. బంగారు పతక వేటలో భారత్ ఆశలను సజీవంగా నిలిపింది.

13939519_1054889401259828_3445135063609222621_n

21 ఏళ్ల సింధు తల్లిదండ్రులు పివి రమణ, పి విజయలు ఇద్దరు వాలీబాల్‌ ప్లేయర్సే. రమణ వాలీబాల్‌లో 2000లో అర్జున అవార్డు గ్రహీత. ఇద్దరు ఫ్రొఫెషనల్స్‌ ఆటగాళ్లు అయినప్పటికి సింధు మాత్రం బ్యాడ్మింటన్‌ను ఎంచుకుంది. 2001లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద ఎనిమిదేళ్ల ప్రాయంలో షటిల్‌ శిక్షణను ప్రారంభించింది. అండర్‌-10లో ఏడు ఈవెంట్లలో టైటిళ్లను సాధించింది. పుణేలో అండర్‌ -14 టీమ్‌ స్వర్ణంను సాధించింది. అయితే అంతర్జాతీయ కెరీర్‌ను 2009లో ప్రారంభించింది.అదే సంవత్సరం కొలంబోలో సబ్‌ జూనియర్‌ ఆసియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిఫ్‌లో కాంస్యం సాధించింది. 2010లో ఇరాన్‌లో ఫాజెర్‌ అంతర్జాతీయ ఛాలెంజ్‌ టోర్నీలో రజతం, 2012లో జర్మనీలో జరిగిన జులైనన్‌ సెహెన్‌క్‌ ఇండోనేషియా ఓపెన్‌లో జపాన్‌కు చెందిన ఒకిహరాను ఓడించింది. 2011 కామన్‌వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ బాలికల స్వర్ణం సాధించింది.

2013, 2014 వరల్డ్‌ ఛాంపియన్‌షిఫ్‌లో కాంస్యం, ఉబెర్‌ కప్‌లో 2014, 2016ల్లో టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యాలు,2014 ఆసియన్‌ గేమ్స్‌లో కాంస్యం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్‌ గేమ్స్‌లో కాంస్యం, 2016 సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిఫ్‌ల్లో 2011, 2012ల్లో కాంస్యాలు, 2012లో స్వర్ణం సాధించింది. తాజాగా ఒలింపిక్స్‌లో కిష్టమైన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచి స్వర్ణ సింధువుగా అవతరించేందుకు తహతహలాడుంతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో స్వర్ణ సింధువుగా రావాలని కోట్లాది మంది భారతీయులు ఆక్షాంక్షను నెరవేరాలని కోరుకుందాం.

- Advertisement -