‘జీరో’ సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న కత్రినా..వీడియో

242
Husn Parcham Video Song

బాలీవుడ్‌ బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్‌ తన అందం, అదిరిపోయే స్టెప్పులతో మరోసారి కుర్రకారు మనసులు దోచుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జీరో’. షారుక్‌ ఖాన్‌ కథానాయకుడు. అనుష్క శర్మ మరో కథానాయిక. ఇందులో కత్రినా మద్యానికి బానిసైన ఓ సినీ‌ స్టార్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘హుస్న్‌ పర్చామ్‌‌’ అని సాగే సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పాటకు ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించగా భూమి త్రివేది.. రాజా కుమారి పాడారు. సంగీత దర్శకుల ద్వయం అజయ్-అతుల్ ఈ పాటకు అరబిక్ టచ్ ఉండే స్టైల్‌లో మంచి ట్యూన్ అందించారు. ఫుల్ జోష్‌లో ఉండే స్పెషల్ సాంగ్ లాగా ఈ పాటను రిచ్ సెట్.. పదుల సంఖ్యలో డ్యాన్సర్ల మధ్యలో చిత్రీకరించారు. కత్రినా స్టెప్స్ మాత్రం సింప్లీ సుపర్బ్. ‘ధూమ్ -3’ లో కమ్లి సాంగ్‌లో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కత్రినా ఇప్పుడు మరోసారి హుస్న్ పర్చమ్‌తో మరోసారి థ్రిల్ చేస్తోంది. మరి అలస్యం ఎందుకు మీరూ చూడండీ..!

ZERO: Husn Parcham Video Song | Shah Rukh Khan, Katrina Kaif, Anushka Sharma | Ajay-Atul T-Series