సంక్రాంతి బరిలో ఎన్టీఆర్, వైఎస్ఆర్..?

199
Yatra-NTR

దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వైఎస్ పాత్రలో మమ్ముటి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి. ప్రస్తుతం శరవేగం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలతో దర్శకుడు రాఘవ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

YSR Biopic Yatra

ఇక ఈ సినిమాని సంక్రాంతి బరిలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. మరోవైపు కచ్చితంగా సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేస్తానని.. నందమూరి బాలకృష్ణ చెప్పేశారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా చేస్తున్న సినిమా సైతం దసరాకి రావడానికి సిద్దం అవుతోంది.

అనిల్ రావుపూడి దర్శకత్వంతో రూపొందుతున్న వరుణ్ తేజ్-వెంకీ మల్టీ స్టారర్ ‘ఎఫ్2’ కూడా సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే.. థియేటర్ల సమస్య తలెత్త అవకాశం ఉంది. మరి సంక్రాంతి బరిలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో చూడాలి ఇక.  ఇద్దరు  దివంగత మాజీ సీఎంల బయోపిక్ లు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. బాక్సీఫీస్ వద్ద ఎవరు ఆకట్టుకుంటారో చూడాలి.