పంట కాలనీలతో రైతు జేబు నిండాలి..

257
- Advertisement -

రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటులో బాగంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇబ్రహింపట్నం క్రాప్ కాలనీలోని 38 గ్రామాల రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. ఈ రోజు బంజారాహిల్స్‌లోని అధికారిక నివాసంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రైతు జేబు నిండాలి వినియోగదారుడి కడుపు నిండటానికే క్రాప్ కాలనీల ఏర్పాటన్నారు. రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం, కాని రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలలో 50 శాతం మాత్రమే స్థానికంగా పండుతున్నాయి. రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాకు 38.54 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం కాగా 19.54 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ లోటు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి. మన రాష్ట్ర ప్రజలకు అవసరమైన కూరగాయలు మన రైతులే పండించాలి, లాభాలు గడించాలి, వినియోగదారులకు తాజాగా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

Minister for Agriculture Pocharam Srinivas Reddyహైదరాబాద్ నగరంలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. వీరందరికి తాజా కూరగాయలు అందించడానికి నగరం చుట్టూ పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా ఇబ్రహింపట్నం ప్రాంతంను ఎంచుకున్నాం. గతంలో ఇబ్రహింపట్నం ప్రాంతంలో 44,000 మెట్రిక్ టన్నుల కూరగాయాల ఉత్పత్తి ఉండగా పంట కాలనీగా మార్చి ప్రోత్సహకాలు అందించిన తర్వాత 83,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇబ్రహింపట్నం అనుభవాలతో త్వరలోనే చేవెళ్ళ, మహేశ్వరం, షాద్ నగర్ ప్రాంతాలలో కూడా పంట కాలనీలను ఏర్పాటు చేస్తాం. అదేవిదంగా ప్రతి జిల్లా కేంద్రం, మున్సిపాల్టిల చుట్టూ 20 నుండి 30 కి.మీ ప్రాంతాలలో పంట కాలనీలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైనంత మేర కూరగాయలను రైతులతో ఉత్పత్తి చేయిస్తామని మంత్రి తెలిపారు.

Minister for Agriculture Pocharam Srinivas Reddyపంట కాలనీలలో కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి రైతులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నాం. ముఖ్యంగా సూక్ష్మ, బింధు సేద్యం, పందిరి తోటలు, నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను అందిస్తున్నాం. సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సి, జీడిమెట్ల ద్వారా నాణ్యమైన విత్తనాల నారును సబ్సిడీపై సరఫరా చేస్తున్నాం. ప్రతి మొక్క ఉత్పత్తికి రూ. 70 పైసల ఖర్చు అవుతున్నా SC/ST లకు ఉచితంగా, ఇతరులకు 10 పైసలకే అందిస్తున్నాం. గత ఏడాదిలో 75 లక్షల నారు మొక్కలను రైతులకు అందించాం. అదేవిదంగా సూక్ష్మ, బింధు సేద్యంలో SC/ST లకు 100 శాతం, BC లు ఇతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, మిగితా అందరు రైతులకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో డ్రిప్ సౌకర్యం కేవలం 2.5 ఎకరాలకు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దానిని 12.5 ఎకరాలకు పెంచాం. గత నాలుగేళ్ళలోనే బిందు, సూక్ష్మ సేద్యానికి రూ. 2,400 కోట్లను సబ్సిడీగా అందించామని తెలిపారు.

త్వరలోనే పంట కాలనీలకు అనుబందంగా మార్కెట్ లను నెలకొల్పుతాం. మధ్య ధళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఉత్పత్తిధారుల నుండి వినియోగధారునికి చెరే విదంగా మార్కెట్ లను ఏర్పాటు చేస్తాం. పండించిన రైతుకు లాభం రావాలి కొనుగోలు చేసిన వినియోగధారుడికి తక్కువ ధరలో తాజా కూరగాయాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్యేశమని మంత్రి పొచారం తెలిపారు. అదేవిధంగా పండిన పంటలకు మరింత విలువ జోడించడానికి ప్రతి నియోజకవర్గంలో అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం.

Minister for Agriculture Pocharam Srinivas Reddy

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారది మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో మూడవ వంతు హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నారన్నారు. స్థానిక జనాభాకు అనుగుణంగా, అవసరమైన పంటలు పండించాలి. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను అందిస్తున్నాం. పందిరి కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో బెంగుళూరు నుండి పూలు హైదరాబాద్ కు దిగుమతి అయ్యేవి. అయితే రాష్ట్రంలో 1150 ఎకరాలలో నూతనంగా పాలిహౌజ్‌ల నిర్మాణంతో మనకు కావలసిన పూలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లాభాలు వచ్చే షేడ్ నెట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. కూరగాయల సగటు ఉత్పధానలో మన రాష్ర్ర్టం వెనుకంజలో ఉన్నది. మన పక్కనున్న తమిళనాడులో ఎకరాకు 17 టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతుండగా మన రాష్ట్రంలో మాత్రం ఇది 7 టన్నులు ఉన్నది. ఈ గ్యాప్‌ను తగ్గించాల్సిన అవసరం ఉన్నది. రైతులు నేరుగా అమ్ముకోవడానికి GHMC పరిదిలో కొన్ని అవుట్‌లేట్స్‌ ప్రారంభించడానికి సన్నహాలు చేస్తున్నామని తెలిపారు.

Minister Pocharam Interact with farmers on Crop Colonies

ఈ సందర్భంగా రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ వెనుకబడిన ప్రాంతమైన ఇబ్రహింపట్నంలో పంట కాలనీని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న ప్రోత్సాహాకాలు బాగున్నాయని, అదనంగా దగ్గరలో మార్కెటింగ్ వసతిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సిమెంట్ ఫాం పాండ్స్, వీడర్స్, స్ప్రేయర్స్, రవాణాకు వాహనాలను అందించాలని కొరారు. అదేవిదంగా ఫ్లోరైడ్ ప్రాంతమైనందున డ్రిప్ పరికరాలపై 7 సంవత్సరాల నిబంధనను తగ్గించాలని కొరారు. రైతుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఇబ్రహింపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఉధ్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామి రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -