జగన్ కు ఓటేయకండి : వైఎస్ సునీత!

15
- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకండి అని వైఎస్ సునీత వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి పార్టీకి అధికారం ఇస్తే ప్రజలు నష్టపోతారని, వైఎస్ సునీత చెప్పుకొచ్చారు. దయచేసి రాష్ట్ర ప్రజలు తన అన్న పార్టీకి ఓటు వేయరాదని ఆమె నొక్కి చెప్పారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికల ముందు హత్య గావించబడ్డ తన తండ్రి వైఎస్ వివేకానంద మర్డర్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. నేరస్తులను స్వయంగా సి‌ఎం జగన్ కాపాడుతున్నారని, కేసు పై విచారణ ముందుకు సాగకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డు పడుతోందని స్వయంగా సీబీఐ పలుమార్లు చెప్పుకొచ్చింది.

ఈ కేసు విషయంలో వైఎస్ సునీత ఒంటరి పోరు చేస్తూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ సీబీఐ పరిధిలో ఉన్నప్పటికీ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ కేసు విషయంలో జగన్ వైఖరిని వైఎస్ సునీత మొదటి నుంచి తప్పుబడుతున్నప్పటికి తన అన్నకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన అన్న పార్టీకి అసలు ఓటు వేయకండి అంటూ సునీత వ్యాఖ్యానించడం వైసీపీని ఘోరంగా దెబ్బ తీసే అంశమే. ఇప్పటికే తన సొంత చెల్లి షర్మిల వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇప్పుడు సునీత కూడా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పడంతో జగన్ పార్టీకి భారీ నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది. మరి తాజాగా వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Also Read:‘కల్కి’కే ట్రబుల్ ఇస్తున్నాడా?

- Advertisement -