Varun:ఆ రోల్స్ పై వరుణ్ తేజ్ రియాక్షన్

9
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పైగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెబుతున్నాడు. కథ బాగుంటే, క్యారెక్టర్ నచ్చితే విలన్ రోల్స్ చేస్తానని చెబుతుంటారు కొంతమంది హీరోలు. హీరో వరుణ్ తేజ్ మాత్రం అస్సలు విలన్ గా నటించనంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేయమంటే చేసేవాడిని అని, ఇప్పుడు మాత్రం విలన్ గా చేయను అంటూ వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ.. “హిందీ సినిమాల్లో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తే బాగుంటుందని మా టీం ను అడుగుతున్నారట. విలన్ గా నటించమని చాలామంది నేరుగా నన్నే అడుగుతున్నారు. హిందీ సినిమాలోనే కాదు, అసలు ఏ భాషలోనూ నేను విలన్ గా చేయను. నాకు విలన్ గా చేసే ఆసక్తి లేదు. విలన్ గా చేయడం నా మనసుకు నచ్చదు. బ్యాడ్ గయ్ గా నన్ను నేను తెరపై చూసుకోవాలని అనుకోవడం లేదు. వరుణ్ తేజ్ అంటే ఓ మంచి ఇమేజ్ మాత్రమే గుర్తుకు రావాలి. పైగా వరుణ్ తేజ్ వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి. ఆ ఫ్యామిలీ ఇమేజ్ కాపాడాలి కదా’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

‘అసలు నాకే ఇష్టం లేనప్పుడు, ఆడియన్స్ కు వరుణ్ తేజ్ ఎందుకు విలన్ గా కనిపించాలి. బహుశా, ఆ సినిమా ప్రత్యేకమైనదై, విలన్ పాత్ర కూడా కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసిందైతే చేస్తానేమో. అంతే తప్ప రెగ్యులర్ విలన్ గా కనిపించే ఆసక్తి లేదు. కానీ మా పెదనాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఏ అవకాశం వచ్చినా.. నేను చేస్తాను’ అంటూ వరుణ్ తేజ్ చెప్పాడు.

Also Read:KTR:జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ చేస్తారా?

- Advertisement -