ఉద్యోగం కోసం జగన్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న మహిళ..!

263
jagan

వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఉహించని అనుభవం ఎదురైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరిన జగన్‌ కాన్వాయ్ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకోగానే ఓ మహిళ అడ్డుపడింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ తన భర్తకు ఉద్యోగం కావాలంటూ జగన్‌ని వేడుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ మహిళను పక్కకు లాగారు. ఈ క్రమంలో మహిళ చేతికి స్వల్ప గాయం కాగా ఇది గమనించిన జగన్‌ ఆ మహిళతో మాట్లాడారు.

దీంతో జగన్ సంబంధిత అధికారులను కలవమని చెప్పి, అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.