రేపటి నుండి యాదాద్రిలో భక్తుల దర్శనాలు..

206
Yadadri temple
- Advertisement -

అశేష భక్త జనానికి శుభ వార్త… భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎధురు చూస్తున్న యాదాద్రి లక్ష్మీ నారసింహా స్వామి వారి దర్శనాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత యాదాద్రిలో భక్తుల దర్శనాలు పు:నప్రారంభం అవుతుండటంతో భక్తులను కరోనా నుంచి కాపాడి వారి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఆలయ అధికారులు పకడ్భందీ చర్యలు తీసుకున్నరు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి యాదాద్రి ఆలయంలోకి భక్తుల రాకను ప్రభుత్వం నిషేధించడంతో భక్తులు లేక ఆలయం బోసిపోయింది. సందడి మాయమైంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆలయ పాశాస్త్యం దెబ్బతినకుండ ప్రతి రోజు ప్రధానార్చులు, దేవాదాయ శాఖ అధికారులు మాత్రమే స్వామి వారికి ఏకాంత సేవల్ని, నిత్య కైంకిర్యాలను నిర్వహించారు.

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇస్తూ జూన్ 8 నుంచి ఆలయాలను ,ప్రార్దనా మందిరాలను తెరుచుకోవచ్చు అని చెప్పడంతో రేపటి నుంచి యాదాద్రిలో కూడా భక్తులను అనుమతి లభించింది. ముందుగా రేపు ఒక్క రోజు ఆలయ ఉద్యోగులు, స్దానిక ప్రజలకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. జూన్ 9 నుంచి ఇతర ప్రాంతాల భక్తులకు కూడా దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఆలయ అధికారులు ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలు మూడు ధఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి విధి విధానాలను ఖరారు చేశారు. ఆలయానికి వచ్చే ప్రతీ భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేసిన తర్వాతే అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.ఇక ప్రతి భక్తులు భౌతిక దూరం పాటించడం,మాస్కలు ధరించడం తప్పని సరి చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూలైన్ లను,దర్శనం లైన్ లను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

ఆలయానికి ప్రవేశించేటప్పుడే చేతులు శుభ్రంగా శానిటేజర్‌తో కడుక్కునేలా చర్యలు తీసుకున్నారు.ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు.తల నీలాలు సమర్పించడం, కొబ్బరి కాయలు కొట్టడం, పుష్కరిణీలో స్నానాలు చేయడం, తీర్ద ప్రసాదాలు, శఠగోపం ఆశీర్వాదం పద్దతుల్ని మరి కొద్ది రోజుల పాటు రద్దు చేశారు. కేవలం స్వామి వారిని దర్శించుకోవడం ఆ తర్వాత నిష్కమించేలా భక్తులకు అవకాశం కల్పించారు. పదేళ్ళ లోపు చిన్నారులు, గర్భణీ స్త్రీలు, 65 ఏళ్ళపై బడిన వృద్దులు ఆలయానికి రాకపోవడం చాలా మంచిదని విజ్ఠప్తి చేస్తున్నారు అధికారులు. ఇక స్వామి వారి లడ్డు, పులిహార ప్యాకెట్లలో ఉంచి కొండ మీద ఉన్న దుకాణాల్లో అందుబాటులో ఉంచుతామని తెల్పారు. కొండపైన దుకాణాలను కూడా సరిబేసి సంఖ్య విధానంలో 50శాతం మాత్రమే తెరిచేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇక వసతి గ్రుహాలను పూర్తిగా మూసి వేసారు.సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామి వారి కళ్యాణం, పుష్పార్ఛన, ఆర్జిత సేవల్ని కేవలం 20 మందితో నిర్వహించుకునేలా చర్యల్ని తీసుకున్నారు.యధావిధిగా వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కొనసాగిస్తున్నారు.ఇప్పటికే ఆలయం మెత్తాన్ని సోడియం హై పో క్లోరోఫైడ్ ద్రావణంతో పిచికారి చేసి శుభ్రంగా శాటినేషన్ చేశారు. ఆలయ పరిసరాల్ని పరిశుభ్రంగా అందంగా ముస్తాబు చేశారు.చెత్త చెదారం తొలగించారు. వ్యర్ద పదార్దాలను తరలించారు.మెత్తంగా ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురు చూస్తున్న స్వామి వారి దర్శన భాగ్యం రేపటి నుంచి అందుబాటులోకి వస్తుండటంతో భక్తుల నుంచి జయజయ ద్వానాలు విన్పిస్తున్నాయి. నిత్య ఆరాధన క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి కొండ రేపటి నుంచి భక్తుల గోవింద నా:మ స్మరణతో మారుమ్రోగనుంది.

- Advertisement -