కన్నుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

29
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈరోజు నుండి 7 రోజులపాటు బ్రహ్మాండంగా జరగనున్నాయి ఉత్సవాలు. ఫిబ్రవరి 2 వ తేదీన ఎదురుకోళ్ల మహోత్సవం జరుగనుండగా 3 వ తేదీన స్వామి అమ్మవార్ల తీరు కళ్యాణ మహోత్సవం జరుగనుంది. 4 వ తేదీన రథోత్సవ మహోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అధికారులు.

ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గుట్ట కింద నుంచి నేరుగా కొండపైకి భక్తులు వెళ్లేలా ఐదు లిఫ్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి 25 నుంచి 35 మంది వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. లిఫ్టుల నుంచి పైకి వెళ్లిన తర్వాత.. నేరుగా క్యూ కాంప్లెక్స్‌కు ప్రత్యేకంగా కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. కారిడార్‌ మీదుగా క్యూ కాంప్లెక్స్‌, ఆలయం వరకు చేరుకోవచ్చు. అటు నుంచి డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్లవచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా లిఫ్టులు అందుబాటులోకి వస్తే సాధారణ భక్తులతోపాటు దివ్యాంగులు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -