నేటి బంగారం, వెండి ధరలివే

14
gold
- Advertisement -

బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590గా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు ఒక్కరోజే రూ.500 పెరిగి రూ.74,700కు చేరింది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.200 మేర పెరిగి ప్రస్తుతం రూ.72,400 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -