నేటి నుంచే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..

473
england vs australia
- Advertisement -

రెండు శతాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమైంది. టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక లీగ్ నిర్వహించడానికి కార్యక్రమానికి ఐసీసీ రూపకల్పన చేసింది. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ ఇందుకు తొలి వేదిక కానుంది.

నేడు ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ …2021 జూన్ 10-14 తేదీల మధ్య లార్డ్స్ వేదికగా ముగియనుంది. 2018 మార్చి 31 నాటికి తొలి తొమ్మిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత పొందాయి. రెండేళ్ల కాలంలో అన్ని జట్లు కలిసి 27 సిరీస్‌లు, 72 టెస్టులు ఆడతాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2021 జూన్‌లో జరిగే టైటిల్‌ పోరులో తలపడడంతో విన్నర్‌ ఎవరో తేలిపోతుంది.

ఇక యాషెస్ సిరీస్‌ అంటే ఇంగ్లాండ్,ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహం…ఈ మెగా సిరీస్‌ సొంతగడ్డపై జరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది ఇంగ్లాండ్‌. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్‌పై పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే… 33 సార్లు ఆస్ట్రేలియా, 32 సార్లు ఇంగ్లాండ్‌ విజయం సాధించడం విశేషం.

- Advertisement -