అఫ్గాన్‌ను చిత్తు చేసిన కివీస్..

33
- Advertisement -

వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి మెరుగైన రన్‌రేట్ సాధించింది. న్యూజిలాండ్ విధించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ 34.4 ఓవర్లలో కేవలం 139 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రహ్మత్‌ షా (36) పరుగులతో పర్వాలేదనిపించగా రహ్మానుల్లా (11), ఇబ్రహీం (14), హష్మతుల్లా (8), అజ్మతుల్లా (27), ఇక్రామ్‌ (19), మహమ్మద్‌ నబీ (7), రషీద్‌ ఖాన్‌ (8) విఫలమయ్యారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 288 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (71), టామ్‌ లాథమ్‌ (68), విల్‌ యాంగ్‌ (54) పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఫిలిప్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:జపాన్…అడ్వెంచరస్ థ్రిల్లింగ్ టీజర్

- Advertisement -