రేపటి నుంచే స్టార్ట్.. వారికి ఇదే చివరి వరల్డ్ కప్?

34
- Advertisement -

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. భారత్ వేధికగా వన్డే ప్రపంచ కప్ రేపటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇప్పటికే పాల్గొనే జట్లన్నీ సన్నాహక మ్యాచ్ లు ఆడుతూ అసలు సమరానికి రెడీ అయ్యాయి. ఇక రేపు జరిగే తొలి మ్యాచ్ లో భాగంగా ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ మ్యాచ్ లు తలపడనున్నాయి. ఈ నెల 8 వ తేదీన టీమిండియా తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో అడనుంది. 2011 తరువాత వరల్డ్ కప్ సాధించని టీమిండియా.. ఈసారి కప్పు వేటలో అత్యంతా పటిష్టంగా కనిపిస్తోంది. కప్పు గెలిచే సత్తా ఈసారి టీమిండియాకే ఎక్కువ అని మాజీలు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంచితే ఈ వరల్డ్ కప్ తరువాత ఆయా జట్లలోని లెజండరీ ప్లేయర్స్ కు ఇదే చివరి వరల్డ్ కప్ కానుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వరల్డ్ టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ తరువాత వన్డే లకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక టీమిండియాలోని మరో టాప్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తరువాత వీడ్కోలు చెప్పే అవకాశం ఉందట. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో సీనియర్స్ వీరిద్దరే. ఇక మిగతా జట్ల విషయానికొస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, స్టార్క్.. వంటి ప్లేయర్స్ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో రూట్, స్టోక్స్ వంటి ఆటగాళ్లకు కూడా ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక న్యూజిలాండ్ టాప్ బ్యాట్స్ మెన్ అయిన విలియమ్సన్, ఫాస్ట్ బౌలర్ బొల్డ్, వంటి వారు కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగడం కష్టమే. మరి వరల్డ్ కప్ తరువాత ఎంతమంది వీడ్కోలు చెబుతారో చూడాలి.

Also Read:TTD:15 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -