ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోన్న మంకీ పాక్స్ విషయంలో ప్రపంచ అరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకొనుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు ఈ రోజు మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్యంగా వర్గీకరించాలా వద్దా అని నిపుణులు గురువారం చర్చిస్తున్నారు. తుది నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలిగిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కు నిపుణుల కమిటీ సలహాలను అందిస్తుంది. ప్రపంచ అత్యవసర పరిస్థితులను విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్‌ఓ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న వేళ ప్రపంచ అరోగ్య సంస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంకీపాక్స్ తీవ్రతను తెలియజేస్తుంది.
అత్యవసర పరిస్థితి తప్పదేమో : ప్రపంచ అరోగ్య సంస్థ
- Advertisement -
- Advertisement -