భారత్ బయోటెక్‌కు డ్యబ్లూహెచ్‌వో గుడ్ న్యూస్

195
bharat biotech

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ్యబ్లూహెచ్‌వో) గుడ్ న్యూస్ తెలిపింది. పిల్ల‌ల‌కు వ్యాపించే రోటా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన రోటావాక్-5డికి ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం తెలిపింది.

ఇప్ప‌టికే రోటావాక్ ను త‌యారు చేసిన ఈ సంస్థ మ‌రింత ర‌క్ష‌ణ కోసం 5డీని త‌యారు చేసింది. రోటావాక్ 5డి పిల్ల‌ల‌కు మరింత ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని, అంతేకాకుండా నిల్వ‌, స‌ర‌ఫ‌రాకు కూడా త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని భార‌త్ బ‌యోటెక్ పేర్కొన్న‌ది. ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం తెల‌ప‌డంతో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని మ‌రింత వేగం చేయ‌నున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.

5 ఏళ్ల లోపున్న పిల్ల‌ల‌కు రోటా వైర‌స్ కార‌ణంగా డ‌యోరియా వంటి ప్రాణాంత‌క‌మైన వ్యాధులు వ‌స్తుంటాయి. ఈ వ్యాధి తీవ్ర‌మైతే పిల్ల‌ల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది. అలాంటి వాటి నుంచి ఈ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా ర‌క్షిస్తుంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.