World Cup 2023:సెంచరీ మిస్.. పాండ్యనే కారణమా!

25
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మద్య జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి రెండు పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకున్న టీమిండియా గెలుపు విషయంలో అందరినీ కలవరపరిచింది. రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. వంటి టాప్ బ్యాట్స్ మెన్స్ అసలు ఖాతనే తెరవకుండా పెవిలియన్ చేరడంతో టీమిండియా ఆశలు అవిరయ్యాయి. అసాధారణ పరిస్థితుల్లో రన్ మిషిన్ విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను చక్క దిద్దిన విధానం వారిద్దరి కెరియర్ లోనే ఒక గొప్ప ప్రధర్శన అని చెప్పవచ్చు. బ్యాటర్స్ కు అనుకూలంగా ఉన్న పిచ్ లో వికెట్లు పడకుండా ఒక్కో పరుగును కూడబెడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయింది. డేవిడ్ వార్నర్ ( 41 ) స్టేవ్ స్మిత్ ( 46 ) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. ఆ తరువాత 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 41 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ ( 85 ), కే‌ఎల్ రాహుల్ ( 97 ), అసాధారణ ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించారు.

రాహుల్ సెంచరీ మిస్
కే‌ఎల్ రాహుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికి మిస్ కావడంతో అతని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు కోహ్లీ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన పాండ్య కారణంగానే రాహుల్ సెంచరీ మిస్ అయిందని కామెంట్స్ పెడుతున్నారు. 39 ఓవర్ లో హార్దిక్ పాండ్య అనవసరంగా సిక్స్ కొట్టాడు. అప్పటికే జట్టు విజయం ఖాయమైపోయింది. ఆ టైమ్ లో కే‌ఎల్ రాహుల్ కి స్ట్రైక్ ఇచ్చిఉంటే అటును సెంచరీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ పాండ్య సిక్స్ కొట్టడంతో రాహుల్ సెంచరీకి కావల్సిన పరుగులు తక్కువయ్యాయి. దీంతో కెరియర్ బెట్స్ ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ మిస్ చేసుకోక తప్పలేదు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘చే’ టీజర్

- Advertisement -