IND VS SL:ఫైనల్ పోరు..గెలిచేదెవ్వరు!

28
- Advertisement -

నేడు ఆసియాకప్ టోర్నమెంట్ లో భాగంగా కొలంబో వేధికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు అమీ తుమి తేల్చుకొనున్నాయి. లీగ్ దశలోనూ సూపర్ 4 లోనూ అదరగొట్టిన ఈ రెండు జట్లు ఇప్పుడు కప్పు కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 22 సార్లు ఇరు జట్లు తలపడగా చెరో 11 విజయాలతో సమంగా ఉన్నాయి. అయితే ఆసియా కప్ ఫైనల్స్ లో మాత్రం భారత్ దే పై చేయిగా ఉంది. 7 సార్లు భారత్ టైటిల్ గెలుచుకోగా, లంక 6 సార్లు కప్పు గెలుచుకుంది. దీంతో ఈసారి కప్పు ఏ జట్టును వరిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ప్రస్తుతం బలాబలాల విషయానికొస్తే ఇరు జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి..

సూపర్ 4 చివరి మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికి టాప్ ఆర్డర్స్ అందరూ ఫుల్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య… ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారీ స్కోర్ ఖాయం. అటు బౌలింగ్ లోనూ బుమ్రా, కుల్దిప్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అటు శ్రీలంక జట్టు కూడా అంతే పటిష్టంగా ఉంది. బౌలింగ్ కు అనుకూలించే కొలంబో పిచ్ లో శ్రీలంక బౌలర్స్ చెలరేగే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ రెండు జట్ల మద్య సూపర్ 4 లో జరిగిన మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చిన వెల్లలాగే తో టీమిండియా బ్యాటర్స్ కు ముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు. గత మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్, హార్దిక్ వంటి వారని తక్కువ స్కోర్ కె పెవిలియన్ చేర్చి ఒక్కసారిగా హడలెట్టించాడు లంక యువకేరటం వెల్లలాగే. ఈ స్పిన్నర్ విషయంలో భారత్ బ్యాట్స్ మెన్స్ అజాగ్రత్త వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ కీలకం కానుంది. మరి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:పవరాస్త్ర విజేతగా శివాజీ

- Advertisement -