విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. విండీస్ నిర్దేశించిన 284 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 240 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 283 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఇన్నింగ్స్‌లో షెయ్ హోప్(95) కీలక సమయంలో గొప్పగా రాణించాడు. ఆఖర్లో నర్స్(40) ఆ జట్టుకు మెరుపు ముగింపునిచ్చాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. దీంతో విండీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని నమోదు చేశాడు. 119 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 10 ఫోర్లు, సిక్సర్‌తో 107 పరగులు చేశాడు. అంబటి రాయుడు 22, రిషబ్ పంత్ 24 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేను భారత్ గెలుచుకోగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టై అయింది. మూడో వన్డేలో విండీస్ విజయం సాధించింది. ఈ నెల 29న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది.