‘వెంకీమామ’ ష్యూటింగ్‌ అప్పుడే..

218
Venky Mama
- Advertisement -

టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ మూవీస్‌ హవా కొనసాగుతోంది. రీసెంట్‌గా నాని-నాగ్ కాంబినేషన్‌లో దేవదాస్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్య-వెంకీల కలయికలో మరో మ‌ల్టీ స్టార‌ర్ తెరకెక్కనుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్‌కి వెంకీ మామ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. దీనికి వెంకీమామ అనే టైటిల్‌ కూడా పెట్టేశారు. ఈ మూవీ ప్రారంభంకానుందని చాలా కాలం నుండి వినిపిస్తున్నా ఇప్పటి వరకు ష్యూటింగ్‌ మొదలు కాకపోవడంతో ఈ సినిమా అగిపోయిందని రూమర్లు వినిపిస్తున్నాయి..

Venky Mama

 

కానీ ఈ విషయంపై ‘వెంకీమామ’ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే వెంకీ ప్రస్తుతం ‘F2’ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు చైతన్య ‘సవ్యసాచి’ షూటింగ్‌లో పాల్గొంటున్నారని.. ఇద్దరూ ఫ్రీ అవ్వగానే ‘వెంకీ మామ’ సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. అంతే కాదు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో పక్కాగా మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాయి.

- Advertisement -