పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్, ఇతర పార్టీలకు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. బంకూరలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన బీజేపీ నేత శ్యామ్ పాడ మండల్ నేతపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం వద్ద ఆయన కారును అడ్డుకుని, కిందలాగి చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగడంతో దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలే బీజేపీ లీడర్లపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు ఈ దాడులకు, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని తృణముల్ కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. బీజేపీ నేతలు మాపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని అధికార పార్టీ లీడర్లు చెప్పుకొచ్చారు. మే 1,3,5 తేదీలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగున్నన్నాయి