‘యాత్ర’ ఫస్ట్ లుక్..

236
First look of YSR's biopic
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రంలో బాలయ్య కథనాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రాజకీయాల్లో ప్రయాణించి తెలుగు ప్రజలకు అనేక సేవలందించారు. తన జీవిత చరిత్రను బయపిక్ గా తెరక్కిక్కిస్తున్నట్లు చాలా రోజలు నుంచి వినిపిస్తుంది. తాజాగా ‘యాత్ర’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహీ వీ రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. జగన్ పాదయాత్రలో సూర్య నటించనున్నారు.

First look of YSR's biopic

ఈ సినిమాకు సంబంధించిన కాప్షన్ చిత్ర బృందం విడుదల చేసింది. ”కడప దాటి గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది..మీ గుండె చప్పుడు వినాలనుంది ” అంటూ సాగే కాప్షన్ ప్రక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి రాజకీయ నేపధ్యంలో సాగనున్నట్లు సమచారం. వైఎస్ఆర్ పాలనలో తెలుగు ప్రజలకు తాను చేసిన సేవలు మరువలేనివని చెప్పాలి. తాను ముఖ్యమంత్రి కాకముందు తాను చేపట్టిన పాదయాత్ర కాన్సెప్ట్ ద్వారా తెరకెక్కుతున్నట్లు సమాచారం. వైఎస్సార్ అభిమానులు ఈ చిత్రం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ఆయన చేసిన సేవలను సినిమాల్లో ఎలా చూపిస్తారో చూడాలంటే చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే..!

- Advertisement -