బంగారు తెలంగాణలో పర్యవరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ వీజీ ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమములో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమినషనర్ పమేలా సత్పతి చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ ఐజీ ప్రమోద కుమార్ బుధవారం వరంగల్ రేంజ్ కార్యాలయము ఆవరణలో పూల మరియు పండ్ల మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నాటిన మొక్కలతో పోలీస్ కమిషనర్ సెల్ఫీ తీసుకోవడం జరిగింది.
అనంతరం వరంగల్ పోలీస్ కమీషనర్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగం అదనపు డి.సి.పి భీంరావులను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి మానసపుత్రికైన హారతాహరం కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది.
ఇందులో భాగం రాజ్యసభ సభ్యులు యం.పీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమము ద్వారా రాష్ట్రంలోని కీలక వ్యక్తులచే మొక్కలను నాటించే విధంగా ఈ కార్యక్రమము విజయవంతంగా కొనసాగుతోంది. వీరు అందించిన స్పూర్తితో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడంతో పాటు, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.