KTR:30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు..

27
- Advertisement -

విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగ్‌లు కొడతారు కానీ 30 నిమిషాలు కూడా కూర్చునే ఓపిక లేదని మండిపడ్డారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల తీరు సరికాదన్నారు.

అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై నిన్న బీఏసీ స‌మావేశం జ‌రిగింది అని కేటీఆర్ గుర్తు చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు 30 రోజులు జ‌ర‌పాల‌ని బీజేపీ నాయ‌కుడు ఉత్త‌రం రాశారు.. కాంగ్రెసోళ్లేమో 20 రోజులు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. కానీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మేమంద‌రం ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక‌రి చొప్పున మాత్ర‌మే స‌భ‌లో ఉన్నారన్నారు.

దీనిని బట్టి వీరికి ప్ర‌జ‌ల మీద ఉన్న చిత్త‌శుద్ధి ఏంటో తెలుస్తుంది. ప్ర‌జ‌ల ప‌ట్ల వీరికున్న ప్రేమ‌, అభిమానం తెలుస్తుంది. బ‌య‌ట‌నేమో డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి అని. కానీ 30 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు వీళ్ల‌కు…. వీళ్ల‌ను ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నారన్నారు.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే ప్రమాదమా?

- Advertisement -