ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌..

9
- Advertisement -

సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స‌తీమణి శోభతో కలిసి ఓటు వేయగా కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోంది… 65 శాతానికి మించి పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉందని తెలిపారు. ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం..ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also read:ఓటేసిన సినీ,రాజకీయ ప్రముఖులు

- Advertisement -