తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

33
- Advertisement -

తులసి ఆకులతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. తులసిని ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు దివ్యాఔషధంలా ఉపయోగిస్తుంటారు. దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా తులసిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తుంటారు. అంతేకాకుండా తులసిమొక్కకి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం చాలమంది తులసి మొక్కను పూజిస్తుంటారు. సాధారణంగా తులసి ఆకులను వివిధ రోగాల నిమిత్తం ఔషధంగా ఉపయోగిస్తుంటాం. అయితే తులసి ఆకుల వలె వాటి గింజలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. .

తులసి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్ ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో తులసి గింజలు వేసి బాగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగితే జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు దూరమవుతాయట. ఇంకా ఈ తులసి గింజలలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ లక్షణాల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

తులసి గింజలను తేనెలో కలిపి ప్రతిరోజూ ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున తీసుకుంటే రక్తపోటు తగ్గుతుందట. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు అధికంగా వేధిస్తుంటే..తులసి గింజలు కొద్దిగా అల్లం కచ్చపచ్చిగా దంచి ఆ రసాన్ని సేవిస్తే ఆ సమస్యలన్నీ దూరమై జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందట. ఇంకా శీతాకాలంలో ఆయా రోగాలను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా తులసి గింజలు సహాయ పడతాయట. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్న తులసి గింజలను ఆయా సమస్యలు తలెత్తినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also  Read:‘తిరగబడరసామీ’..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -