వైద్యరంగంలో తెలంగాణ భేష్‌..

16
- Advertisement -

వైద్యరంగంలో తెలంగాణ భేష్ అన్నారు మంత్రి హరీష్‌ రావు. శాసనమండలిలో మీడియాతో మాట్లాడన హరీష్‌..తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు.2008లో రిమ్స్, 2013లో నిజామాబాద్ మెడికల్ కళాశాలలు గులాబీ జెండా ఒత్తిడితో వచ్చాయని…9ఏళ్లలో 29 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం అన్నారు.

వైట్ కోట్ రెవల్యూషన్ తీసుకొచ్చాం అని..దేశం మొత్తం సీట్లు 2,220 మెడికల్ సీట్లు ఉంటే..900 సీట్లు ఒక్క తెలంగాణ లో ఉన్నాయన్నారు.అంటే 43 శాతం mbbs సీట్లను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.దేశం మొత్తం వైద్యులను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు.ధాన్యం ఉత్పత్తిలో, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

‘ బీ ‘ కేటగిరీలో కూడా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నాం అన్నారు.కోర్టు నుంచి అనుమతి వస్టే అధునాతన ఉస్మానియా ఆసుపత్రి కడతాం అన్నారు.కొత్తగా మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించామని..ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాం అన్నారు.కొత్తగా వచ్చే 8 మెడికల్ కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే ప్రమాదమా?

- Advertisement -