దర్శకుడికి హీరోయిన్ గా శ్రియ

543
Shriya-Saran
- Advertisement -

మెగా దర్శకుడు వివి. వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వినాయక్ హీరోగా కొత్త దర్శకుడు నరసింహారావు దర్శకత్వంలో సీనయ్య అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది.

కాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినా ఇప్పటి వరకు హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం హీరోయిన్ శ్రీయ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్, చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రాల‌లో శ్రియ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈవిషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగా వినాయక్ తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయన నటనపై ఆసక్తి చూపించారు. ఆయన చివరగా సాయి ధరమ్ తేజ్ తో ఇంటలిజెంట్ మూవీ తీశారు. ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. దర్శకుడిగా భారీ సక్సెస్ లను అందుకున్న వినాయక్ నటుడిగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -