మెట్రోలో ప్రయాణించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

488

మొదటి సారి మెట్రో రైలులో ప్రయాణం చేశారు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన రోజు పంజాగుట్ట ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్.బి నగర్ వరకు ప్రయాణం చేశారు. మెట్రో రైల్లో మంత్రి నిలబడి ప్రయాణం చేశారు. జనాలను పలకరిస్తూ మెట్రో అందిస్తున్న సేవల గురించి తెలుసుకోవడం జరిగింది.. ప్రజలు మెట్రోతో చాలా తృప్తిగా ఉన్నారని మంత్రి అన్నారు.

prashant reddy in metro

వర్కింగ్ డేస్‌లో రద్దీ చాలా పెరిగిందని ఎప్పటికప్పుడు మెట్రో తగిన సౌకర్యాలు కల్పిస్తుందని మెట్రో మేనేజ్మెంట్ మంత్రికి తెలిపింది. రోజుకు లక్షన్నర నుండి 2 లక్షల ప్రయాణికులు మెట్రో రైల్ సేవలను వినియోగించుకుంటున్నారు అని సిబ్బంది మంత్రికి తెలియజేశారు.

మెట్రోలో ఎల్‌.బి నగర్‌కు చేరుకున్న మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఎల్.బి నగర్ నుండి ఎర్రమంజిల్ స్టేషన్‌ నుండి బయలుదేరి వెళ్లారు.

Telangana Minister Vemula Prashant Reddy In Hyderabad Metro Rail..Telangana Minister Vemula Prashant Reddy In Hyderabad Metro Rail..