ఆయనపై గౌరవంతోనే ఆర్‌ఆర్ఆర్ చేశా: శ్రియ

109
sriya
- Advertisement -

అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యం క‌ల‌బోసిన న‌టీమ‌ణుల్లో ముందు వ‌రుస‌లో ఉండే తార శ్రియా సరన్‌. అందుకే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా రాణిస్తూ వ‌స్తున్నారు. భార‌త‌దేశ‌పు అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీమ‌ణుల్లో…శ్రియ ఒకరు కాగా తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోనూ ఓ చిన్నపాత్రలో మెరిసింది.

ఈ నేపథ్యంలో తనపాత్రపై స్పందించిన శ్రియ…తన క్యారెక్టర్ చిన్నదనే బాధలేదన్నారు. రాజమౌళి సినిమా అనగానే ఓకే చెప్పేశానని…. కథ ఏమిటి? నా పాత్ర ఏమిటి? ఇంకా ఎవరెవరు చేస్తున్నారు? అనేది నేను అడగలేదన్నారు. ఒక పెద్ద సినిమాలో భాగమైనందుకు సంతోషపడుతున్నానని.. సినిమా టిక్కెట్ల కోసం తాను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నానని కాని దొరకట్లేదని తెలిపింది శ్రియా.

‘ఆర్ ఆర్ ఆర్’ లో అజయ్ దేవగణ్ భార్య సరోజిని పాత్రలో ఆమె కనిపించింది. తెల్లదొరల తూటాలకు నేల కొరిగిన పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

- Advertisement -