మంత్రి ఈటలను కలిసిన విర్కో బయోటెక్ ప్రతినిధులు..

281
etela
- Advertisement -

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ జనాన్ని బయటపడవేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వస్తేనే దీనిని పూర్తి స్థాయిలో నివారించగలమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కి చికిత్స లేదు, కేవలం లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో ప్లాస్మా తెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కరోనా వైరస్ సోకి నయం అయిన వ్యక్తి రక్తం సేకరించి దాని నుండి ప్లాస్మా వేరు చేసి కరోనా సోకిన వారికి అందిస్తే నయం అవుతుందని చెప్తున్నారు.

దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఈ నేపధ్యంలో విర్కో బయోటెక్ ప్రతినిదులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. కోవిడ్-19 చికిత్స కి ప్లాస్మా థెరపీ, ఇమ్మునో గోబ్లిన్ అందించడం ద్వారా చికిత్స అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం సంప్రదించిన మొదటి కంపెనీ తమదని మంత్రికి తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ అనుమతి కూడా వచ్చింది అని, కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మొదటి మూడు నెలలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇమ్మునొ గ్లోబ్లిన్ లు వైరస్ నుండి సమర్థవంతంగా రక్షణ అందిస్తాయని వీర్కో బయోటెక్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ తుమ్మూరు తెలిపారు. H1N1,SARS,MERS,ఎబోలా నుండి కూడా రక్షణ లభిస్తుందని వివరించారు. 2013 నుండి ప్లాస్మా థెరపీ ప్రయోగాలు చేస్తున్నాము అని కొన్ని వ్యాధులకు ఇప్పటికే విజయవంతంగా చికిత్స అందిస్తున్నాము అని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై నిపుణుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో విర్కొ బయోటెక్ కంపెనీ డైరెక్టర్స్ డాక్టర్ రాజేశ్ తుమ్మూరి, పూజ ఆకాంక్ష ఉన్నారు.

- Advertisement -