కోహ్లీ మరో అరుదైన ఘనత..!

668
virat
- Advertisement -

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పరుగుల మెషిన్‌గా చెప్పుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మ‌ళ్లీ మొద‌టి స్థానాన్ని అత‌ను కైవ‌సం చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 928 పాయింట్ల‌తో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. కాగా స్టీవ్ స్మిత్‌, విలియ‌మ్‌స‌న్‌, పుజారాలు త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇక ఆసీస్ క్రికెట‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, మార్న‌స్ లాబుషాంగే, ఇంగ్లండ్ క్రికెట‌ర్ జో రూట్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ 900 పాయింట్ల‌తో తొలి స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండ‌ర్ జాబితాలో విండీస్ ప్లేయ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ 473 పాయింట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. ర‌వీంద్ర జ‌డేజా 406 పాయింట్ల‌తో రెండ‌వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Indian captain Virat Kohli has dethroned Australia’s Steve Smith for number one spot in the ICC Test Rankings..

- Advertisement -