ఉప్పల్‌లో కోహ్లీ సేన ప్రాక్టీస్‌ షురూ..

348
uppdal stadium

ఈ నెల 6న జరగనున్న భారత్ – వెస్టిండీస్ తొలి టీ20 కోసం ఉప్పల్ స్టేడియం సిద్దమైంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలిమ్యాచ్ కావడంతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే టికెట్ల అమ్మకం ప్రారంభం కాగా మ్యాచ్‌కు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఏర్పాటుచేయడంతో పాటు పోలీస్‌ సెక్యూరిటిని ఏర్పాటుచేశారు.

భారత్ జట్టు సభ్యులు  మంగళవారం హైదరాబాద్ చేరుకోగా ఇవాళ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఆటగాళ్లు అంతా ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. వచ్చే సంవత్సరం టీ20 ప్రపంచ కప్ సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్ కీలకం కానుంది.

ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎప్పుడూ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఈసారి కూడా అదేవిధంగా బ్యాటింగ్ కు అనుకూలించవచ్చని తెలుస్తోంది. దీంతో పరుగుల వరద ఖాయం అని భావిస్తున్నారు.

వాస్తవానికి భారత్-విండీస్ మధ్య తొలి టీ20 ముంబైలో డిసెంబర్‌ 6వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. డిసెంబ‌ర్ 8న తిరువంతపురంలో రెండో టీ20 జరగనుండగా డిసెంబర్ 11న ముంబైలో మూడో టీ20 జరగనుంది.

All set for India vs Westindies 1st T20…All set for India vs Westindies 1st T20…All set for India vs Westindies 1st T20