వైశ్యులకు కళ్యాణలక్ష్మీ : గుత్తా

273
gutha sukenderreddy

నిరుపేద వైశ్యులకు సాయం అందాలంటే రాజకీయాలతో మాత్రమే సాధ్యమని తెలిపారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు అభినందన సత్కారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గుత్తా ….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని..వైశ్యులకు కల్యాణ లక్ష్మీ, నిరుపేద వైశ్యులకు పెన్షన్ కూడా ఇస్తున్నామని చెప్పారు.

వైశ్యులు రాజకీయాలలో పాల్గొంటున్నారు… వారితో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందన్నారు. వైశ్య కార్పొరేషన్ కావాలని డిమాండ్ ఉందని…దానిని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. గాంధీజీ వైశ్య కులం నుండే వచ్చారు కానీ ఆయనను ప్రతి ఒక్కరు పూజిస్తారని చెప్పారు.

2014 రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి మహాసభల్లో తాను ఎప్పుడు పాల్గొనలేదని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సన్నిహితంగా వ్యవహరిస్తూ అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటల విమర్శలు ఉండేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదన్నారు. వైశ్య భవన్‌ కోసం 5 ఎకరాల భూమిని కేటాయించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

gutha sukenderreddy speech at arya vaishya mahasabha….gutha sukenderreddy speech at arya vaishya mahasabha